టీడీపీ, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. గుడివాడ ప్రజలకు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో నేను నేర్పుతా అని సోమువీర్రాజు అంటున్నాడు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి ఎలా చేసుకోవాలో తెలియదా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకొని..చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు అని మండిపడ్డారు.
గోవా కల్చర్ అంటున్నారు..గోవాలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. గోవాలో ఎందుకు కాసినో కల్చర్ ను బ్యాన్ చేయడం లేదు. చంద్రబాబు శిష్యులు బీజేపీలో ఉన్నారు. మత కల్లోలాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ నేతలు టీడీపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. గుడివాడ లో ఒక రకంగా ,గోవాలో ఓక రకంగా బీజేపీ ఉండకూదని కోరుతున్నా అన్నారు నాని.
చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా..రావడానికి సిద్దమే. గవర్నర్ ను కాకపోతే రాష్ర్టపతి కలిసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. డిపాజిట్ రాని బీజేపీ వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? బీజేపీ మతతత్వ పార్టీ.. కర్నూలు ,కడప వెళ్లి బీజేపీ నేతలు ఏం మాట్లాడారు. ప్రజలను రెచ్చ గొట్టే కార్యక్రమాలకు పోలీసులు ఎందుకు అనుమతిస్తారు..
నేను మాట్లాడిన దానికి, బుద్ద వెంకన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు ఇంట్లో ఉండి మిగతా నేతలతో నన్ను తిట్టిస్తున్నారు. గోవా వెళ్తే..కాసినో ఎలా ఉంటుందో సోమువీర్రాజుకు తెలుస్తుంది. సరదా ఆటలను కాసినో అనుకునే సోమువీర్రాజు కు ఏం చెప్తాం. చంద్రబాబుకు బీ టీం గా సోమువీర్రాజు పనిచేస్తున్నారు. మంత్రిని చేసిన కాంగ్రెస్ ను వదిలి టీడీపీలో చేరిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే ఆయన పార్టీని గెంటేసి..టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక.. తన భార్యతో రాజకీయ లబ్ధి పొందే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు కొడాలి నాని.
చంద్రబాబు రాజకీయ జీవితం కోసం.. తన కుటుంబాన్ని ,భార్యను రాజకీయాలకు వాడుకుంటున్నారు.అధికారంలో ఉన్నప్పుడు జూద శాలల నుంచి డబ్బులు వసూలు చేసిన పార్టీ టీడీపీ.కే కన్వెన్షన్ లో కాసినో ఆడినట్లు నిరూపిస్తే పెట్రోల్ పొసుకొని చనిపోతా అని సవాల్ చేసా.ఇప్పుడు కే కన్వీనర్ కాదు.. గుడివాడ అంటున్నారు. వర్ల రామయ్య సీఐగా ఉన్నప్పుడు.. నేను 9 వ తరగతి చదువుతున్నా. కే కన్వెన్షన్ 2010 లో నిర్మించానన్నారు.
1991లో చంద్రబాబు కు హెరిటేజ్ లేదు.. అధికారంలోకి వచ్చాకే హెరిటేజ్ వచ్చింది.చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి..త్వరలో బడిత పూజ ఉంది. చంద్రబాబు వల్ల నష్టపోయిన మహిళలు బయటకు వస్తున్నారు.టీడీపీ నేతలకు చాలెంజ్ చేస్తున్నా..చంద్రబాబు చేసిన ఆరచకాల గురించి గంట గంటకు మాట్లాడుతా. చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా..రావడానికి సిద్దమే.
గవర్నర్ ను కాకపోతే రాష్ర్టపతి కలిసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను మాట్లాడిన దానికి, బుద్ద వెంకన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉందన్నారు మంత్రి నాని.
