Site icon NTV Telugu

త్వరలోనే టూరిజానికి పాలసీ తీసుకువస్తాo : కిషన్ రెడ్డి

టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు.త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తామని… ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజంకి మంచి అవకాశాలున్నాయని… ఇప్పటికే శ్రీశైలం సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని… కేంద్ర పర్యాటక శాఖ నుండి రాష్ట్రానికి సుమారుగా 234 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. ఏపీ పర్యాటక రంగంగా అబివృద్ది చెందే అవకాశం ఉందని… 27 కోట్ల రూపాయలు అమరావతి లో బౌద్ధ క్షేత్రంలో అబివృద్ది చేస్తున్నామన్నారు. విశాఖ పర్యటకంగా పూర్తి స్థాయిలో అబివృద్ది చెందుతుందని.. టూర్ ఆపరేటర్లకు 10 లక్ష రూపాయల,గైడ్ లకు లక్ష రూపాయలు లోన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version