NTV Telugu Site icon

కోవిడ్‌పై ఫైట్.. కియా రూ.5 కోట్ల సాయం..

Kia YS Jagan

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది.. ప్ర‌భుత్వాల‌కు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు సాయం అందించ‌డానికి మేమున్నాం అంటూ ముందుకు వ‌స్తున్నాయి ప‌లు సంస్థ‌లు.. తాజాగా, కియా మోటార్స్‌ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ప‌త్రాల‌ను అంద‌జేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సీఎంను కోరారు.. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధకు అందించింది కియా.. ఈ కార్య‌క్ర‌మంలో కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో కుక్‌ హ్యున్‌ షిమ్‌. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లీగల్, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ జ్యూడ్‌లి, కియా ఇండియా ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌. టి.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.