NTV Telugu Site icon

Thota Trimurthulu: మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు తీసుకెళ్లిన కీలక విషయాలు

Mithun Reddy Thota Trimurth

Mithun Reddy Thota Trimurth

Key Points In Thota Trimurthulu And Mithun Reddy Meetings: రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎంత వాడీవేడీగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. వేణుకు మళ్లీ టికెట్‌ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ సంచలన ప్రకటన చేస్తే.. సీఎం జగన్‌ ఉన్నంతకాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరు నేతలు తగ్గేదే లే అన్నట్టుగా ఉండగా.. వీరి ఎపిసోడ్‌లో తాజాగా అనుకోని ట్విస్ట్ వెలుగు చూసింది. గతంలో రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు.

Pawan Kalyan: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు

దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో భాగంగా మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని తోట తెలిపారు. ఇంతకుముందు పిల్లి సుభాష్, తాను రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసినా.. నియోజకవర్గానికి కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్తే ఏదో అవుతుందని కాదని.. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను వెళ్తే, తన వర్గానికి చెందిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారని, అందుకే వెనక్కి తగ్గుతున్నానని తెలిపారు. వ్యవహారం ఇలాగే ఉంటే.. రేపు తాను చెప్పినా, ఓటు వేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్‌లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ

రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని తోట త్రిమూర్తులు వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఈనెల 26వ తేదీన జగన్ అమలాపురం పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి.. ఈ దశలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చు.