Kethireddy Peddareddy Challenges JC Family: తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఒకరికి మరొకరు సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా జేపీ ఫ్యామిలీకి పెద్దారెడ్డి ఓ సవాల్ విసిరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక.. తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యామ్‌లను నింపి, రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నామని పెద్దారెడ్డి తెలిపారు. కానీ.. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడూ ఈ పని చేయలేదని, చేసినట్లు వాళ్లు నిరూపించగలరా? అని ఛాలెంజ్ చేశారు.
Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
కేవలం డ్యామ్‌లు నిర్మిస్తే సరిపోదని.. వాటిని నీటితో నింపాలని పెద్దారెడ్డి సూచించారు. గ్రామాల్లో గొడవలు పెరగకుండా, అలాగే ఫ్యాక్షనిజం తగ్గించడానికి తాను పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని.. దానికి కారణం సీఎం జగన్ అని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు గొడవలు చాలా తగ్గాయని, నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్‌కు ఎంక్వైరీ చేసినా ఆ విషయం తెలుస్తుందని అన్నారు. ఫ్యాక్షన్ గొడవలు ఉండొద్దని సీఎం జగన్ తమకు గట్టిగా చెప్పారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పారు. అలాగే.. తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని, అక్కడే ఉన్న అధికారులతో చర్చించి, వాటిని పరిష్కరిస్తున్నట్లు పెద్దారెడ్డి వెల్లడించారు.
Seediri Appalaraju: జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం
అంతకుముందు కూడా.. అస్మిత్ పుట్టినరోజు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ చేయడాన్ని ఉద్దేశిస్తూ, 73 ఏళ్ల వయసులో జేసీకి డాన్స్ చేయడం అవసరమా అంటూ పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ.. ఇప్పుడు డాన్సులు చేసుకునే పరిస్థితికి దిగజారారని వ్యంగ్యంగా విమర్శించారు. ఎవరి ఇంట్లోనైనా వేడుకలు ఉంటే చాలు.. అక్కడికి వెళ్లి డాన్స్ చేసే స్థితికి జేసీ వచ్చారంటూ సెటైర్లు వేశారు.