NTV Telugu Site icon

Kesineni Nani: ఎంపీ నానిపై బాబాయ్ నాగయ్య ఆరోపణలు

Nagaiah Vja

Nagaiah Vja

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనకు అన్యాయం చేసాడంటూ నాని బాబాయి నాగయ్య ఆందోళనకు దిగడం చర్చనీయాంశం అయింది. కేశినేని భవన్ పక్కన తన బిల్డింగ్ నిర్మాణం నిలిపేయాలని టౌన్ ప్లానింగ్ నోటీసులు జారీచేసింది. టౌన్ ప్లానింగ్ ను ఉసిగొల్పి అక్రమ నోటీసులు కేశినేని నాని ఇప్పించాడంటున్నారు నాగయ్య.

నాగయ్య ఊర్లో లేనపుడు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేశినేని నాని దుర్మార్గుడు.. నా ఆస్తి లాక్కోవాలని చూస్తున్నాడు అంటూ అందోళనకు దిగడంతో ఈ అంశం బెజవాడలో హాట్ టాపిక్ అయింది. కేశినేని నాని చేస్తున్న అన్యాయం అడ్డుకోవాలని నాగయ్య ఆందోళనకు దిగాడు. తనకు అన్యాయం జరిగితే చనిపోతానంటూ నాగయ్య వార్నింగ్ కూడా ఇచ్చాడు. పోలీసులు, అధికారులు తన‌గోడు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నాగయ్య.

గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వున్న ఎంపీ కేశినేని నాని మౌనంగా వుండడం చర్చనీయాశంగా మారింది. అంతేకాదు, ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడులో ఎంపీ కేశినేని నాని పాల్గొనలేదు. నాని ఆలోచన ఏంటనేది అంతుచిక్కడం లేదంటున్నారు టీడీపీ శ్రేణులు. మరి, బాబాయ్ నాగయ్య ఆరోపణలపై ఎంపీ నాని ఎలా స్పందిస్తారో చూడాలి. టీడీపీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. అందులో విజయవాడ నుంచి నాని కాగా, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి రామ్మోహననాయుడు వున్నారు. వీరిలో నాని పార్లమెంటులో చురుకుగా పాల్గొనేవారు. బెజవాడ పాలిటిక్స్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నాని అంటీముట్టనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.

PM Modi: చలామణిలోకి కొత్త నాణేలు.. అదే ప్రత్యేకత!