చైనా లో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. అయితే ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. అయితే తాజాగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని ఎంపీ కేశినేని నాని కోరారు.
ఏపీలో కరోనా కల్లోలం.. టీడీపీ ఎంపీ కేశినేని నానికి పాజిటివ్
