NTV Telugu Site icon

Kesineni Nani: వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదు..

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: ప్రస్తుతం పార్లమెంటులో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2024 పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిపాలనను మెరుగుపరిచేందుకు, అవినీతిని అరికట్టేందుకు తీసుకు వచ్చారు.. ముస్లింల మత వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది.. ఈ బిల్లుతో వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ జరుగుతుంది.. తద్వారా అక్రమ ఆక్రమణలు, భూ దుర్వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. అదనంగా, ఆడిట్, పర్యవేక్షణ పెరుగుతాయి.. తద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది.. ఇకపై వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసులు ఏళ్ల తరబడి ఉండకుండా త్వరగా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుందని కేశినేని నాని పేర్కొన్నారు.

Read Also: Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరోసారి సిట్‌ముందుకి శ్రవణ్‌రావు.. అరెస్ట్‌ తప్పదా..?

అయితే, ఇందులో చాలా సమస్యలు కూడా ఉన్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదు.. ముస్లింలు స్వతంత్రంగా నిర్వహించే సంస్థల్లో ఇతర మతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం సరైన పద్ధతి కాదు.. అంతేకాకుండా, ఇప్పటి వరకు వక్ఫ్ మాత్రమే వక్ఫ్ ఆస్తులపై నిర్ణయాలు తీసుకునేది.. కానీ, ఈ బిల్లుతో ప్రభుత్వ అధికారులకు అధికారం ఇచ్చారు, ఇది రాజకీయ దుర్వినియోగానికి దారి తీయొచ్చు అని పేర్కొన్నారు. నా అభిప్రాయం ఏమిటంటే.. నిజంగా ప్రభుత్వం వక్ఫ్ పరిపాలనను మెరుగు పర్చాలనుకుంటే వక్ఫ్ బిల్లును మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వ అధికారులకు అధికారం ఇవ్వకూడదు.. అలాగే, ఇతర మతస్థుల బదులుగా స్వతంత్ర ముస్లిం నిపుణులను బోర్డుల్లో చేర్చడం మంచి నిర్ణయం.. ఈ చట్టంపై ప్రభుత్వం ముస్లిం సంఘాలతో సమగ్ర చర్చలు జరిపి.. ఓ అంగీకారానికి వచ్చి ముస్లిం సమాజంలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలిగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కేశినేని నాని వెల్లడించారు.