లోకేష్ ఒక జోకర్.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఆయన కథ చూస్తాం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడిపి నేత నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని చెప్పారని….లోకేశ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు అయిపోతుంది…ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని..తిట్టాలనుకుంటే మేము తిట్టగలం…మాకు ఆ సంస్కృతి లేదన్నారు. మంచి సంస్కారంతో జగన్ ను.. రాజశేఖర్ రెడ్డి పెంచాడన్నారు. లోకేష్ ఎంత సేపు ట్విట్టర్ లో మాట్లాడాల్సిందే… ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని ఎద్దేవా చేశారు. పెసరవాయి హత్యలో పోలీస్ దర్యాప్తుపై నమ్మకం ఉందన్నారు.
read more : పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు…
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
లోకేష్ ఒక జోకర్.. వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చురకలు అంటించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయకుండా నిలవడం ఎవరితరం కాదని.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏమి చేశారో గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.. హత్య రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని.. నారా లోకేష్ కు సంస్కారంగా మాట్లాడడం కూడా తెలీదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను చూసి లోకేష్ నేర్చుకోవాలని.. మాజీ సీఎం వైఎస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో లోకేష్ నేర్చుకోవాలని చురకలు అంటించారు. పులికి పులిబిడ్డ పుట్టింది…నక్కకు నక్క బిడ్డ పుట్టిందని.. లోకేష్ బఫున్ కి ఎక్కువ ..జోకర్ కి తక్కువ అని సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!