Karumuri Venkat Reddy Satires On Lokesh Yuvagalam And Chandrababu Naidu: ఏపీ రాజధాని వ్యవహారంపై చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల మీద, అలాగే లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైఎస్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కరుమూరి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో మూడు రాజధానుల అంశం లేదని, కాబట్టి ఆ చట్టం ప్రకారం రాజధానిని ఎన్నుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. మరి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయని.. ఆ లెక్క ప్రకారం ఏపీలో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోకూడదని మీరు భావిస్తున్నారా? అంటూ కౌంటరిచ్చారు. ఈ జిల్లాల విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి, ఏదైనా పోరాటం చేయదలచుకున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన బీనామీలు కొన్న భూములకు రేట్లు రావాలన్న ఉద్దేశంతోనే.. అమరావతినే రాజధానిగా నిర్ణయించాలంటూ ఆయన పట్టుబడుతున్నారని ఆరోపించారు.
Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయవాదం చాలా బలంగా ఉందని, దాని వల్లే మన రాష్ట్రం రెండుగా విడిపోయిందని వెంకట్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అనేక కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా.. మరో విభజన రాకూడదని, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారన్నారు. కానీ.. మూడేళ్లుగా దాన్ని అడ్డుకుంటూ కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలు ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అంటున్నారని.. మరి ‘అమరావతి’ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు జనాలు రావడం లేదని, దాన్ని కవర్ చేసుకోవడం కోసమే చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రప్రభుత్వంపై, సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కేందుకే చంద్రబాబు మీడియా ముందు మాట్లాడారని విమర్శించారు.
Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్
అసలు యువగళం మీద విమర్శలు చేయాలనే ఆలోచన తమకు లేదని, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాట్లాడాల్సి వస్తోందని వెంకట్‌రెడ్డి అన్నారు. సాధారణంగా మనం న్యూస్ ఛానెల్స్ చూస్తుంటామని, అప్పుడు ఛానెల్స్ మారుస్తున్న క్రమంలో మధ్యలో కామెడీ ఛానెల్స్ కూడా వస్తాయని, యువగళం కూడా అలాంటి కామెడీ వ్యవహారమేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ యువగళంలో లోకేష్ మాట్లాడుతున్న మాటలు చాలా వింతగా, విచిత్రంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఓ యువగళం ఉంది, దాని నిండా పప్పుంది, దాన్ని తిప్పేందుకు పప్పు గిత్తి ఉంది, ఆ పప్పుని ఉడకబెట్టడం కోసం కింద ఎల్లో మీడియా అనే పెద్ద నిప్పు ఉంది, 15 రోజుల నుంచి ఎంత ఉడకబెట్టాలని ట్రై చేసినా ఆ పప్పు ఉడకట్లేదని వెంకట్‌రెడ్డి కౌంటర్లు వేశారు.