NTV Telugu Site icon

Karthika Masam 2022: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

Karthika Masam

Karthika Masam

కార్తిక మాసం ప్రారంభమైంది.. హిందువులు ఎంతో భక్తితో ఎదురు చూసే మాసం రానేవచ్చింది.. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. పుణ్యస్నానాలు ఆచరించేవారు, మాలధారణ చేసేవారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారు.. వ్రతాలు చేసుకునేవారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, కార్తిక మాసం ఇవాళ ప్రారంభం కావడంతో.. శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది.. నేటి నుంచి మొదలయ్యే ఈ మాసం వచ్చే నెల 23 కార్తీక పౌర్ణమితో ముగినుంది.. ఈ నేపథ్యంలో.. శ్రీశైలంలో నేటి నుండి నవంబర్ 23 వరకు కార్తిక మసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. పాతాళగంగలో పుణ్యస్నానాలు, కార్తిక దీపారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం.. భక్తులు కార్తిక దీపాలు వెలిగించేందుకు గంగాధర మండపం, శివ మాడవీధి ఏర్పాటు చేశారు.. కార్తిక సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు, మొత్తం15 రోజులు స్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు..

Read Also: Govardhan Puja 2022 Special LIVE : గోవర్ధనపూజ సందర్భంగా ఈ స్తోత్రం వింటే చాలు..

మరోవైపు భక్తులతో గోదావరి పుష్కర ఘాట్లతో పాటు శైవ క్షేత్రాలు కలకలలాడుతున్నాయి.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు.. చేస్తున్నారు భక్తులు. నేటి నుండి కార్తిక మాసం ఆరంభం కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తిక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు.. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిటకిటలాడుతున్నాయి.. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు మహిళలు.. ఈ నేపథ్యంలో.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లను శుభ్రపరుస్తున్నారు మున్సిపల్ శానిటరీ సిబ్బంది..

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యల్లో భక్తులు తరలివచ్చారు.. శైవక్షేత్రాలైన కొమరవెల్లి మల్లన్న, ఐలవోను మల్లికార్జునస్వామి, చెరువుగట్టు, కోటిలింగాల, ధర్మపురి.. ఇలా తెలంగాణలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు.. కార్తిక మాసం సందర్భంగా భీమవరం, పాలకొల్లు పంచారామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. భారీగా తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.. అటో నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కార్తికమాస పూజలు ప్రారంభం అయ్యాయి.. కార్తిక మాసం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుండే కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు.. పదవ శక్తి పీఠం అధిష్టాన దేవతైన పురుహుతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. ఇక, విజయనగరం జిల్లాలో కార్తికమాసం సందర్బంగా శివాలయాల్లో అభిషేకాలు జరుగుతున్నాయి.. ఎస్ కోట మండలం పుణ్యగిరి, సన్యాసి పాలెం, తాటిపూడి లో కార్తీక మాస పూజలు ప్రారంభం అయ్యాయి.. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కార్తిక సందడి ప్రారంభమైంది.. స్వామి వారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు.. కార్తిక మాసం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి రద్దీ పెరిగింది.. మరోవైపు.. పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు రద్దీ పెరిగింది..