NTV Telugu Site icon

Adapa Seshu: పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి వాహన ప్రమాదంలో కుట్ర..! ఆయనపై వైసీపీ అనుమానం..

Adapa Seshu

Adapa Seshu

Adapa Seshu: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌లో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి.. అయితే, ఈ ప్రమాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.. ఈ ఘటనలో సంచలన ఆరోపణలు చేశారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.. రోడ్డు ప్రమాదంలో కుట్ర కోణం ఉందని ఆరోపించారు.. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నర ఆయన.. నిన్న పెద్దిరెడ్డి వాహనానికి జరిగిన రోడ్డు ప్రమాదంపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.. రోడ్డు ప్రమాదం విషయంలో కుట్రకోణం దాగి ఉంది.. సమగ్రంగా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఈ ప్రమాదాన్ని కుట్రగా అనుమానించి కమిటీ వేసి విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.. కేవలం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి టార్గెట్‌గా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.. చంద్రబాబు గతంలో పలువురిని అంతమొందించినట్లు ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చే శారు.. మీకూ అదే పరిస్థితి వస్తుందని చంద్రబాబును హెచ్చరించారు.. మరోవైపు.. చంద్రబాబుకు దమ్ముంటే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో పోటీ చేసి గెలవాలంటూ సవాల్‌ విసిరారు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు.

Read Also: Bonda Uma: రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయండి..!

కాగా, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు సోమవారం పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్‌ రోడ్‌పై జరిగిన ప్రమాదంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిలు తృటిలో తప్పించుకున్నారు.. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్‌ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలు ఒకే కారులో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కాన్వాయ్‌లోని కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న మిథున్‌ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే.