తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.
Also Read:సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ప్రభుత్వ తప్పులు ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు. రైతుల సభకు బీజేపీ నుండి హాజరవుతున్నాం. ప్రభుత్వం పెట్టే బాధలను భరించి రైతులు పాదయాత్ర పూర్తి చేశారు. రైతుల ఆకాంక్ష నెరవేరాలన్నారు. కర్నూలులో.. హైకోర్టు, అమరావతిలో రాజధాని ఉండాలనేది బీజేపీ స్టాండ్ అని తెలిపారు. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం.
దళితులను మోసం చేశారు: రావెల కిషోర్ బాబు
దళితులను మోసం అధికారంలోకి వచ్చి ఎస్సీ నియోజకవర్గ మైన తాడికొండ నుండి రాజధాని మార్చటం దళితుల వ్యతిరేకమైన చర్య.ఏ దళితులైతే జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చారో వారే అధికారంలో నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రావెల ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను జగన్ మానుకోవాలని సూచించారు.
