విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపులో మొత్తం నగదు నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. దీనిలో బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములు వచ్చింది. అంతే కాకుండా 14 దేశాల నుంచి విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైంది.
పలు దేశాల విదేశీ కరెన్సీ
524 యూఎస్ఏ డాలర్లు,
ఇంగ్లాడ్ కు చెందిన 70ఫౌండ్లు,
సింగపూర్ కు చెందిన 52 డాలర్లు,
ఆస్ట్రేలియాకు చెందిన 60 డాలర్లు,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ అరభ్ ఎమిరేట్స్ (ధిరామ్స్ )-590,
సౌదీకి చెందిన 28-రియాల్స్ ,
ఓమన్ కు చెందిన 300 బైసాలు,
ఖతార్ కు చెందిన 73 రియాల్స్,
మలేషియాకు చెందిన 2-రింగిట్ లు,
యూరోప్ కు చెందిన 115 యూరోస్
, కువైట్ కు చెందిన 6.1/3 దినార్ లు,
హంగ్ కాంగ్ కు చెందిన 100 డాలర్లు,
కెనడాకు చెందిన 270 డాలర్లు హుండీలో వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.
