Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.. రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తర్వాత చెప్తాను అంటున్నాడు.. గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారు.. ఎన్నికల కోడ్ వల్ల రాజధాని పనుల టెండర్లు అలస్యం అయ్యాయి.. మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయి.. ఘోస్ట్ రాజధాని అని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు అని మంత్రి నారాయణ మండిపడ్డారు.
Read Also: Summer Tips : వేసవి లో ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..
ఇక, జిల్లాల పరిధిలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం త్వరలో ప్రారంభం కానుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది.. 10 లక్షల కోట్లు అప్పులు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అని ఆరోపించారు. మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కొన్ని మున్సిపాలిటీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం జరిగింది.. కొన్ని కారణాలతో మహిళలకి శాండ్ రీచ్ లు ఇవ్వడం కుదరలేదు.. ఆస్థిలో సగ భాగం మహిళలకి ఇచ్చిందే టీడీపీ అన్నారు. స్థానిక సంస్థలలో మహిళలు ఉండడానికి తెలుగు దేశం పార్టీ తెచ్చిన రిజర్వేషన్లు కారణం అని నారాయణ వెల్లడించారు.