Tuni Municipality: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని పెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మొదలు.. పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. కూటమి ఖాతాలో పడిపోతున్నాయి.. ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.. ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరు అయ్యారు.. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు.. దీంతో, చైర్మన్ గా నార్ల భువన సుందరిని, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు.. ఎన్నిక అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు.. ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ భువన సుందరి, వైస్ చైర్మన్ ఆచంట సురేష్.. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యం అని.. చైర్మన్ ఆధ్వర్యంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చి అభివృద్ధి దిశగా కృషి చేస్తామని అన్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య.
Read Also: Rishabh Pant: రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాక్.. కారణం ఏంటంటే?
