Site icon NTV Telugu

Kakinada: 8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లిన వృద్ధుడు.. కౌన్సిలర్నంటూ బెదిరింపులు..

Mulakala Cheruvu2

Mulakala Cheruvu2

Kakinada: కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. స్థానిక రాజకీయ నేత నారాయణరావు ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను “ఇంటికి తీసుకెళ్తాను” అంటూ స్కూల్ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక, విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నారాయణరావును ప్రశ్నించగా, అతడు వారితో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. తాను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ అక్కడకి వచ్చిన వారిపై బెదిరింపులకు కూడా దిగాడని గ్రామస్థులు చెప్పారు.

Read Also: Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే, ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నుంచి అమ్మాయిని ఎలా పంపించారు? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో నారాయణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version