Site icon NTV Telugu

Servant Theft: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన పనిమనిషి

Chori

Chori

Servant Theft: కాకినాడలో పని చేస్తున్న ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగలకు పని మనిషి సహాయం అందించింది. కాకినాడ పట్టణంలోని మహా లక్ష్మీ అనే మహిళ కాళ్లు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం, డబ్బులు దోచుకుని తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు పారిపోయారు. అయితే, ఈ ఘటనపై ఇంటి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రక్షక భటులు.. కేసు నమోదు చేసుకుని తెలంగాణకు చెందిన రజిత, రఘు, లతా, వెంకటేష్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పని మనిషి రమ లక్ష్మీ సహకారంతో ఈ దొంగతనం చేసామని ఆ నలుగురు నిందితులు చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Read Also: Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

అయితే, ఆ నలుగురికి సమాచారం ఇచ్చి డబ్బులు, బంగారం దోచుకోవడానికి సహాయం అందించిన పని మనిషి రామలక్ష్మీ.. వారి దగ్గర నుంచి 10 గ్రాముల బంగారం, 2. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక, దొంగలకు సమాచారం ఇచ్చి పని చేస్తున్న ఇంట్లోనే కన్నం వేసిన రామ లక్ష్మీ విచారిస్తున్నారు. తన యజమాని ఇంట్లో డబ్బులు, బంగారాన్ని చోరీ చేయడంలో సహయం చేసినట్లు ఒప్పకోవడంతో ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు.

Exit mobile version