MLC Anantha Babu Wife: ఎమ్మెల్సీ అనంత బాబు భార్య కోసం పోలీసుల గాలింపు..

  • ఎమ్మెల్సీ అనంత బాబు భార్య కోసం పోలీసుల గాలింపు..
  • సుబ్రమణ్యం హత్యలో లక్ష్మీ దుర్గ పాల్గొన్నారని పోలీసులు అడిషనల్ ఛార్జిషీట్..
Anantha Babu

Anantha Babu

MLC Anantha Babu Wife: కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ కోసం పోలీసుల గాలింపు వేగవంతం చేసింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంత బాబుతో పాటు లక్ష్మీ దుర్గ కూడా పాల్గొన్నారని అడిషనల్ ఛార్జిషీట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు. కేసులో ఆమెను ఏ2గా చేర్చి ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచారు. అడ్డతీగల, కాకినాడలలో లక్ష్మీ దుర్గ లేదని పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 20, శుక్రవారం దినఫలాలు..

అయితే, హత్య జరిగినప్పుడు తాను బంధువులను పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లానని గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో లక్ష్మీ దుర్గ చెప్పింది. ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 2022 మే 19వ తేదీన రాత్రి అనంత బాబుతో పాటు ఆమె కూడా కారులోనే ఉందని సీసీ కెమెరా విజువల్స్ ని సిట్ టీమ్ కలెక్ట్ చేసింది.