Site icon NTV Telugu

Mudragada Health: స్పృహ కోల్పోయిన ముద్రగడ.. కొడుకు గిరి కీలక వ్యాఖ్యలు..!

Mudragada

Mudragada

Mudragada Health: వైసీపీ నేత, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కి పడిపోయాయని చెప్పారు. అయితే, ముద్రగడ ప్రస్తుతానికి స్పృహలో లేరని తెలిపారు. నిన్న ముద్రగడని కాకినాడలో రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ ( మౌర్య, అమృత )కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రెండు హాస్పిటల్స్ లోను డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకి తీసుకుని వెళ్లాలని సూచనలు చేశారు. మొదట ఒప్పుకున్న కుమారుడు గిరి, ఆ తర్వాత కాకినాడలోనే మరొక ప్రైవేట్ హాస్పిటల్ ( మెడి కవర్) హాస్పిటల్ కి తరలించారు.

Read Also: Vaani Kapoor : హాట్ ఫొటోస్ తో మదిలో వీణలు మోగిస్తున్న వాణి కపూర్

అయితే, ముద్రగడని పద్మనాభంను చూడడానికి అర్ధరాత్రి కూతురు క్రాంతి వచ్చింది. పద్మనాభం దగ్గరికి అక్క క్రాంతి రావడంపై ఆయన కుమారుడు గిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేనిదే తండ్రి దగ్గరికి ఎవరిని పంపొద్దు అని ఆస్పత్రి సిబ్బందికి గిరి చెప్పారు. పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముద్రగడ కుమారుడు గిరి ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version