Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్‌ జగన్‌.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత

Mudragada Padmanabham

Mudragada Padmanabham

Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకుల సమక్షంలో ముగిశాయి. అయితే, అంత్యక్రియల సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులకు ముందుకు రాగా.. అధికారిక లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్ పోలీసులను అడ్డుకుని తోసివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించకపోయినా, ఆయన సతీమణి మరియు కుమారుడు గిరిబాబును పరామర్శించారు. అనంతరం ముద్రగడ పాడెను మోసి తన నివాళి అర్పించారు. ఇక, అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైఎస్‌ జగన్‌తో కలిసి ముద్రగడ పాడెను మోసారు.. ఈ సమయంలో స్వల్ప అస్వస్థత కలగడంతో అక్కడే వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ నుంచి బొత్సను బయటకు పంపించారు..