NTV Telugu Site icon

MP Uday Srinivas Bike Ride: హెల్మెట్ లేకుండా జనసేన ఎంపీ బైక్ రైడ్‌.. ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ట్రోల్స్..!

Mp Uday Srinivas Bike Ride

Mp Uday Srinivas Bike Ride

MP Uday Srinivas Bike Ride: హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తు హంగామా సృష్టించారు జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. అయితే, సోషల్ మీడియాలో మెయిన్ రోడ్డుపై జనసేన ఎంపీ బుల్లెట్ నడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.. మోటార్ వాహనాల చట్టనిబంధనలు సక్రమంగా అమలు చేయడం లేదని ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించింది కోర్టు.. ఈ సమయంలో ప్రజా ప్రతినిధిగా ఉంటూ.. ఓ ఎంపీ నిబంధనలు పాటించకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.. ముందు.. వెనక కార్లతో హడావిడి చేస్తూ బుల్లెట్ నడుపుతున్నారు ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌.. ఇక, ఎంపీ బైక్ విన్యాసాల కోసం ట్రాఫిక్ ఆపారు పోలీసులు.. ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సింది పోయి సర్కస్ ఫీట్లు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..

జనసేన ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? | MP Uday Srinivas | Kakinada | Ntv

Show comments