NTV Telugu Site icon

Kakinada: కాకినాడ కమిషనర్‌పై మంత్రికి ఫిర్యాదు.. కారణం ఇదే..

Kakinada

Kakinada

Kakinada: కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్ భావనపై మున్సిపల్ మంత్రి నారాయణకి ఫిర్యాదు అందింది.. మంత్రి నారాయణకు ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే కొండ బాబు.. కమిషనర్‌ భావనపై ఫిర్యాదు చేశారు.. వివాదాస్పద స్థలం బయో మెథనేషన్ ప్లాంట్‌కి కేటాయించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. గతంలో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ ధర భూమికి వందల కోట్లు టీడీఆర్ బాండ్లు కేటాయించారని ఆరోపణలు చేశారు కొండబాబు.. ఇక, అదే స్థలంలో బయో మెథనేషన్ ప్లాంట్ కి భూమి పూజ చేశారు కమిషనర్, ఎమ్మెల్యేకి ఆహ్వానం ఉన్నప్పటికీ డుమ్మా కొట్టారు.. సొంత ప్రభుత్వంలో తన పరిస్థితి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మారిందని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు కొండబాబు.. అయితే, టీడీఆర్ బాండ్ల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతుందని.. అవకతవకలు తేలితే రద్దు చేస్తామని చెబుతున్నారు కాకినాడ కమిషనర్ భావన.. మొత్తంగా కాకినాడ కమిషనర్‌పై మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు ఫిర్యాదు వెల్లడం చర్చగా మారింది..

Read Also: IND vs NZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో భారత్.. ఇక ఆశలు ఆ ఇద్దరిపైనే! లంచ్‌ బ్రేక్‌కు స్కోర్ ఎంతంటే?