Minister Narayana: కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చాం.. డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల హామీ నెరవేరుస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం రూ. 2000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల చొప్పున నిధులు జమ చేశామన్నారు. రెండో విడత కింద నేడు మరో 7 వేల రూపాయలను జమ చేస్తున్నామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: Property Dispute: ఆస్తికోసం అమానుషం.. దత్తపుత్రుడి హక్కును అడ్డుకున్న సొంత సోదరుడు!
అయితే, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అని మంత్రి నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వానికి అవగాహన లేక ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసింది.. ఇప్పుడు మన నెత్తిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ అప్పులన్నీ టాక్సుల రూపంలో మనమే చెల్లిస్తున్నాం.. పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు సైతం వెళ్తున్నాం.. ఒక్కొక్క మంత్రికి రెండు దేశాల చొప్పున పెట్టుబడుల ఆహ్వానానికి వెళ్ళాము.. నేను, దుబాయ్, సౌత్ కొరియాలో పర్యటించి అనేక వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్రానికి ఆహ్వానించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Bihar: రేపు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం !
ఇక, విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమీట్ లో రూ. 13 లక్షలకు పైగా ఎంఓయులు కుదిరాయని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి.. ఎన్నికలకు ముందు చెప్పిన హామీల్లో 90 శాతం పూర్తి చేశాం.. మిగిలిన 10 శాతం కూడా వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
