NTV Telugu Site icon

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా.. ఎందుకో తెలుసా..?

Mudragada

Mudragada

ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ పద్మనాభం ఓ లేఖను రాశారు.

Read Also: Fire Broke out in Dhaba : గ్రేటర్ నోయిడాలోని దాబాల్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఎనిమిది ఫైర్ ఇంజన్లు

ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ:.. “గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి..
14-3-2024 తేదిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్సీపీ లోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటి ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొక సారి క్షమాపణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి.. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి” అని ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.

Show comments