Fire Broke out in Dhaba : గ్రేటర్ నోయిడాలోని దాబాల్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఎనిమిది ఫైర్ ఇంజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Broke out in Dhaba : గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ సమీపంలోని దుకాణాలు, దాబాలలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ధాబాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఈ మంటల కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిండన్ నది ఒడ్డున నిర్మించిన క్లోజ్డ్ ధాబాలో ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమీపంలోని ఆరు దాబాలు, రెండు దుకాణాలు కూడా ఈ భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. దాబాల లోపల గ్యాస్ సిలిండర్లను కూడా ఉంచారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా లోపల ఉంచిన గ్యాస్ సిలిండర్లను బయటకు తీశారు. రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు.
Also Read
- Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
Read Also:Chaari 111 OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
#WATCH उत्तर प्रदेश: ग्रेटर नोएडा के बिसरख थाना क्षेत्र में कुछ ढाबों में शॉर्ट सर्किट के कारण भीषण आग लग गई। मौके पर दमकल की आठ गाड़ियां मौजूद हैं। आग बुझाने का काम चल रहा है। विवरण की प्रतीक्षा है।
(वीडियो सोर्स: जिला अग्निशमन अधिकारी) pic.twitter.com/xoxZi8qjFC
— ANI_HindiNews (@AHindinews) March 13, 2024
అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆరు దాబాలు, రెండు దుకాణాలు దగ్ధమైనట్లు గుర్తించారు. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
Read Also:Praneeth Rao: ప్రణీత్‌రావు కేసు.. ప్రత్యేక టీంకు బదిలీచేసిన పోలీసులు
తాజావార్తలు
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!