NTV Telugu Site icon

AP 10th Results 2025: పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు

Kakainada

Kakainada

AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి నయా రికార్డ్ సృష్టించింది. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం, మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read Also: Pahalgam Attack: ప్రతీకారం తీర్చుకోవాల్సిందే?.. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్న నెటిజన్లు..

కాగా, ఎన్టీవీతో మాట్లాడిన విద్యార్థి నేహంజలి.. పదో తరగతిలో 600కి 600 మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది. 600 మార్కులు రావాలని అనుకున్నాను వస్తాయని ఊహించలేదు.. ఐఐటీ ముంబై లో చదువుతాను.. భవిష్యత్ లో ఐఏఎస్ కావాలని అనుకుంటున్నాను అని పేర్కొనింది. లాంగ్వేజెస్ లో 100కి 100 మార్కులు కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను అని చెప్పుకొచ్చింది. నాకు మా పేరెంట్స్, టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అని నేహంజలి తెలిపింది. ఇక, నేహంజలి 600కి 600 మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.