Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం సమీపంలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… పెళ్లికారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక పెళ్లి కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అన్నవరం వద్ద పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు తిరిగి వెళ్తుండగా, కారుకు ఫ్రంట్ టైర్ పేలడంతో అది నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ప్రజలపై దూసుకెళ్లింది.. దీంతో, ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు.. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని తక్షణం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.. ఇక, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. బాధితులను పరామర్శించారు. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Koti Deepotsavam 2025: కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
