రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పవన్ నామినేషన్ కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు ర్యాలీకి సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
Read Also: Satyabhama: కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు.. ఆరోజే రిలీజ్!!
ఇదిలా ఉంటే.. కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారిగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతు ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. తమను అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. మరోసారి జగన్ కు అవకాశమిస్తే.. రాష్ట్రాన్నే అమ్మేస్తాడని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Read Also: Kesineni Nani: భారీ ర్యాలీతో కేశినేని నాని నామినేషన్..