Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమైనవి.. విశాఖలో జరగనున్న సమ్మిట్ ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి పి. నారాయణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా కాకినాడ మ్యాట్ మైరైన్ షిప్పింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ యార్డ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ యార్డ్‌ను ఏపీఐఐసీ సేకరించిన 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కాకినాడ సముద్రతీర పరిశ్రమల విస్తరణకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.
Read Also: Killer Doctors: కిల్లర్ డాక్టర్లు.. కారు పేలుడులో ఆ నలుగురి భాగస్వామ్యం ఇలా!
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు,” అని విమర్శించారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందో లేదో ముందుగా చూస్తారు.. గత ఐదేళ్లలో ఏపీలో అరాచక పాలన ఉందని విదేశీ పెట్టుబడిదారులు చెప్పారు అని వివరించారు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. దేశ, విదేశాలలో పెట్టుబడుల కోసం చురుకైన చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు జరగనున్నాయని తెలిపారు.. రాష్ట్ర భవిష్యత్తు పరిశ్రమలపై ఆధారపడి ఉంది అన్నారు మంత్రి నారాయణ.
