Site icon NTV Telugu

Hunt for Gold at Uppada Beach: మరోసారి ఉప్పాడ సముద్ర తీరానికి భారీగా జనం.. బంగారం కోసం వేట..!

Hunt For Gold At Uppada Bea

Hunt For Gold At Uppada Bea

Hunt for Gold at Uppada Beach: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్‌ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది.. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.. కానీ, యథావిధిగా ఈ సారి కూడా ఉప్పాడ తీరానికి భారీగా తరలివచ్చారు స్థానికులు.. తుఫాన్‌ ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారం ముక్కలు కొట్టుకొచ్చాయా? అని ఎగబడి మరి వెతుకున్నారు.. ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు దొరుకుతాయని ఏరుకునేందుకు పోటీపడుతున్నారు స్థానికులు..

Read Also: Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..

కాగా, గతంలో రాజులు కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న విలువైన వస్తువులు ఇలాంటి తుఫాన్‌ల సమయంలో బయటపడతాయని గతంలోనూ తుఫాన్‌ వచ్చిన సమయంలో.. ఉప్పాడ తీరంలో స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు.. స్థానిక మత్స్యకారులు తుఫాన్‌ తర్వాత తీరంలో బంగారం కోసం జల్లెడపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. గతంలో, చిన్నారులు సైతం స్కూల్ మానేసి బంగారం కోసం వెతికారు.. అక్కడ కొందరికి బంగారు రేణువులు దొరికాయని.. మరికొందరికి ఉంగరాలు, ముక్కుపుడలకు దొరికాయి… అంతేకాదు, గతంలో ఈ ప్రాంతంలోనే వెండి నాణేలు కూడా పెద్ద సంఖ్యలు దొరికాయి.. దీంతో, మరోసారి సముద్ర తీరానికి వచ్చి.. ఏమైనా దొరుకుందా? అనే కోణంలో సముద్ర తీరాన్ని జల్లడ పడుతున్నారు స్థానికులు.. అసలే బంగారం, వెండి ధరలు ఆల్‌ టైం హై రికార్డులను సృష్టించి.. కాస్త తగ్గుముఖం పట్టాయి.. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి కూడా ఏర్పడడంతో.. ఇప్పుడు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు.. వాళ్లకు దొరికి చిన్ని బంగారం రేణువులతో సంతోషపడుతున్నారు.

Exit mobile version