Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంప్రదాయ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని స్టాల్స్ ను పరిశీలించనున్నారు పవన్.. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయబోతున్నారు డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు..
Read Also: Telangana: గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్..
మరోవైపు.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి పిఠాపురం రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.. అయితే, తొలిసారిగా ఆయన ఏడీబీ రోడ్డులో వెళ్తారట.. గతంలో కత్తిపూడి మీదగా రాకపోకలు సాగిస్తూ వచ్చారు పవన్ కల్యాణ్.. కానీ, రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఇకనుంచి తాను కూడా అదే రోడ్డు లో ప్రయాణం చేస్తానని.. ఏడీబీ రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన విషయం విదితమే.. ఏడీబీ రోడ్డు ప్రమాదంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఈ ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం.. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డు బాగా దెబ్బతింది.. గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తాం.. ఇక నుంచి పిఠాపురం పర్యటనకు గోతులతో కూడిన ఏడీబీ రోడ్డు గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే..