Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: పవన్‌ సంచలన వ్యాఖ్యలు.. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తున్నారు..!

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్‌ కల్యాణ్‌. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. భారత్‌పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తు్న్నాయ్నారు.. ఇక, విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు.. అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..

Read Also: Pilot Rohith Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. త్వరలోనే తాండూరుకు వస్తా!

ఇక, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి.. స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తితో గత ప్రభుత్వం పై పోరాడాం.. కలిసి ఉందాం.. కలిసి పోరాడుదాం అన్నారు పవన్‌ కల్యాణ్.. స్వాతంత్య్రం దగ్గర నుంచి ఆపరేషన్ సిందూర్‌ వరకు అన్ని మత ప్రాతిపదికన జరిగాయి అని పేర్కొన్నారు.. అయితే, పాకిస్థాన్‌లో హిందువులు ఎందుకు ఉండరు? అని ప్రశ్నించారు.. సుస్థిరత ఉండాలంటే ప్రభుత్వం దశాబ్దామున్నర ఉండాలని ఆకాక్షించారు.. మరోవైపు, కాకినాడలో డీజిల్ అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు.. బియ్యం, డీజిల్ అని వదిలేస్తే తీర ప్రాంతం నుంచి వెపన్స్ , బాంబులు తీసుకు వస్తారు అంటూ హెచ్చరించారు.. తీర ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version