Site icon NTV Telugu

Woman Constable Jayasanthi: ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన మహిళా కానిస్టేబుల్‌.. తీవ్ర వివాదం..!

Woman Constable Jayasanthi

Woman Constable Jayasanthi

Woman Constable Jayasanthi: రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో.. ఆమె వైరల్‌గా మారిపోయింది.. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు.. అంతేకాదు.. హోం మంత్రి అనిత.. ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు.. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో దుమారమే రేగుతోంది..

Read Also: Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!

అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి.. కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది.. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు.. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈవో.. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సై గా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి, ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తలలో నిలిచారు.. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు.. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డీఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి.. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత.. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో.. ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..

Exit mobile version