NTV Telugu Site icon

Annavaram temple: అన్నవరం ఆలయానికి వచ్చే నెయ్యిపై ప్రభుత్వం ఆరా..!

Annavaram

Annavaram

Annavaram temple: తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మిగతా ఆలయాలకు సరఫరా చేసే నెయ్యిపై కూడా దృష్టి పెట్టింది.. కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయం అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ… రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది? అనే విషయంపై ఆరా తీస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అంతేకాదు.. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అన్నవరంలో ఏడాదికి లక్ష కేజీలకు పైగా నెయ్యి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, తిరుమలకు వచ్చే నెయ్యి వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిన వేళ.. అన్నవరం.. ఆ తర్వాత సింహాచలం నెయ్యిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Read Also: Punjab Govt: నేడు పంజాబ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

కాగా, అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు దక్కిన విషయం విదితమే.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు.. 150 గ్రాములు ప్రసాదాన్ని 20 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు.. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేలా దేవస్థానం చర్యలు చేసుకుంటుంది.. ప్రసాదం తయారు చేసే స్వాములు కూడా అత్యంత నిష్టతో ఉంటారు.. ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తారు.. 45 లీటర్ల నీటిని బాగా మరిగించి 15 కిలోల గోధుమలు వేస్తారు.. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో వేసి ఉడికిస్తారు.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, యాలకుల పొడిని కలుపుతారు ఆ తరువాత గంటసేపు వంట స్వాములు బాకు తో తిప్పుతారు.. ఆ తర్వాత ట్రాలీ తొట్టెలో వేసి మూడు గంటలు పాటు ఉంచుతారు… తెలుగు రాష్ట్రాల్లోనే అన్నవరం సత్యదేవుడు ప్రసాదం ఎంతో ఫేమస్.. ఇప్పుడు తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి వ్యవహారం టాపిక్‌గా మారగా.. ఇప్పుడు అన్నవరంపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్..