SVSN Varma: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రత కల్పించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు (1+1) గన్‌మెన్లను కేటాయించింది ప్రభుత్వం.. తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వర్మ.. దీంతో, ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది.. మరోవైు మాజీ ఎమ్మెల్యే వర్మ భద్రతకు సంబంధించి గన్‌మెన్‌లు అవసరమని తాము నివేదిక ఇవ్వలేదని చెబుతున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు.. కానీ, వర్మ విజ్ఞప్తి మేరకు గన్‌మెన్లను కేటాయించింది ప్రభుత్వం.. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వర్మ దగ్గర గన్‌మెన్‌లు బాధ్యతలు తీసుకున్నారు.. కాగా, ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన వర్మ.. నియోజకవర్గంలోని పరిస్థితులు.. ఇతర అంశాలపై చర్చించారట.. ఇప్పుడు ఆయనకు భద్రత కల్పించింది సర్కార్.. ఇక, తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ.. ఆ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. ఈ నేపథ్యంలో వర్మకు ఏదైనా కీలక పదవి ఇస్తారనే చర్చ అప్పటి నుంచి సాగుతోంది.. తాజా పరిణామాలతో ఆయనకు ఏదైనా పోస్టు ఇస్తారా? అనేది మరోసారి తెరపైకి వచ్చింది..
Read Also: Tollywood : తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసిన యంగ్ బ్యూటీ
