NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: గంజాయిపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఎంత ఫోకస్ పెట్టిన నిలువరించలేకపోతున్నారు.. సరఫరా చేసేవాళ్లు వ్యక్తులకు ఎత్తుల పై ఎత్తులు వేసి పని పూర్తి చేసుకున్నారు.. ఏజెన్సీ ఏరియా రంపచోడవరం చింతూరు నుంచి కాకినాడ తీసుకుని వస్తున్నారు.. దానిని తెలివిగా వ్యవహరించి రాష్ట్రాలు దాటించేస్తున్నారు.. పది రోజుల కిందట గంజాయి స్మగ్లర్లు ఏకంగా పోలీసులపై కారు ఎక్కించేశారు. దానిని బట్టి గంజాయి స్మగ్లర్లు ఎంత రెచ్చిపోతున్నారో అర్థం అవుతుంది.. దానికి కూడా ఒక కోడ్ ఉపయోగిస్తున్నారు.. ఏజెన్సీ ఏరియా నుంచి కాకినాడ కి తీసుకురావడానికి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారు.. ఇక్కడ వాళ్ళు చెప్పిన మూడో పార్టీకి సరుకు ఇచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తారు.. అక్కడ నుంచి హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతుంది.. దానికి మరో రేటు ఉంటుంది.. అసలు నెట్వర్క్ నడిపే వాళ్ళు మాత్రం ఎక్కడ సీన్ లో ఇన్వాల్వ్ కావడం లేదు.. వ్యవహారం మొత్తం ఆన్లైన్లో నడుపుతున్నట్లు పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి లెక్కలు సరి చేయడానికి సిద్ధము అవుతున్నారు.

Read Also: Bobby : అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతానన్నారు!

గంజాయి సరఫరా చేసే వారికి కాకినాడ గేట్ వే గా మారింది.. నిత్యం జిల్లాలో ఏదో మూల గంజాయి మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం అన్ని రకాల రవాణా అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువయ్యారని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.. వేరే చోట నుంచి గంజాయి తీసుకు వస్తున్నారు.. పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.. గత ఏడాదిగానే దాదాపు 8,000 కేజీలు గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.. పలువురుపై కేసులు నమోదు చేసిన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు.. ఒకవేళ దొరికిపోయిన ప్రత్యామ్నాయ మార్గాలకు వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలపై కూడా దృష్టి పెడుతున్నారు… అటవీ ప్రాంతాలలో యథేచ్చగా సాగుని ప్రోత్సహిస్తున్నారు.. గిరిజనులకు ఆశలు చూపించి వారితో ఈ పనులు పూర్తి చేయిస్తున్నారు.. కాకినాడ కేంద్రంగా హైదరాబాద్, ఒడిశా, బెంగళూరు, ముంబై ఎక్కువగా ట్రాన్స్‌పోర్ట్‌ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ వేలల్లో పెట్టుబడిలు పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు.. నిత్యవసర వస్తువులు బియ్యం లోడ్ లతో కలిపి వాటిని బోర్డర్ దాటించేస్తున్నారు.. చెక్ పోస్ట్ ల దగ్గర కూడా తెలివిగా వివరిస్తున్నారు.. చేర్చాల్సిన చోటికి చేర్చాల్సిన సరుకు చేర్చేస్తున్నారు.. దాంతో గంజాయి ట్రాన్స్పోర్ట్ ఈజీగా మారింది.. స్మగ్లర్లు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు.. యువకులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు.. చిన్న చిన్న పాన్ డబ్బాల దగ్గర కూడా గంజాయి దొరుకుతుంది.. గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు.. దొంగతనాలు చేయడం, ఈవ్ టీజింగ్ చేయడం చేస్తున్నారు.

Read Also: Shraddha Srinath: బాలయ్యని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది!

మొత్తానికి ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొచ్చి కాకినాడ కేంద్రంగా సరఫరా చేస్తున్నారు … కాకినాడ గేట్ వే గా మారడం తో ఉన్నతాధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.. కేసులు పెట్టిన డోంట్ కేర్ అన్నట్లు స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు.. పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోతే మరింత విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగే అవకాశం ఉంటుంది.. డిప్యూటీ సీఎం స్వయంగా గంజాయి మత్తు విస్తరిస్తుందని కామెంట్ చేశారు.. దానికి తగ్గట్టుగా పోలీసులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది..

Show comments