కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 24వ వార్డులో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే ద్వారంపూడిని ప్రశ్నించాడు. దీంతో ద్వారంపూడి సదరు వ్యక్తి ఆధార్ కార్డును పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అర్హత లేదని చెప్పడంతో సదరు వ్యక్తి పదే పదే పింఛన్‌పై ఎమ్మెల్యేను నిలదీశాడు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సహనం కోల్పోయారు. వింటున్నాను కదా అని మీద మీద పడిపోతే ఊరుకోను అంటూ చేయి చూపించారు. ఆధార్ కార్డులో వయసు తప్పు అయినప్పుడు తిన్నగా ఉండాలని.. దానికి తానేం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఏదో రకంగా పింఛన్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారని ఎదురు ప్రశ్నించారు. ఇంతమందికి పథకాలు ఎలా ఇచ్చామో తెలియదా అని అడిగారు. ఈ మేరకు నీకు ఏ పథకాలు రావు దొబ్బేయ్ అంటూ సదరు వ్యక్తిపై ఎమ్మెల్యే ద్వారంపూడి నోరుజారారు. దీంతో అక్కడున్న వాళ్లందరూ అవాక్కయ్యారు.