తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం ఒకటి విమర్శల పాలవుతోంది. పన్నులు కట్టనివారిపై మునిసిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇళ్లలో సామాన్లు జప్తు వాహనాలపై కాకినాడ కమిషనర్ వివరణ ఇచ్చారు. నిన్న ప్రారంభించిన జప్తు వాహనాలను నిలిపివేశామన్నారు. సకాలంలో పన్నులు కట్టకపోతే ఇళ్లు జప్తు చేయడం ఎన్నో ఏళ్లుగా ఉందన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు జప్తు వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జప్తు వాహనాలు నిలిపివేశామని తెలిపారు స్మార్ట్ సిటీ కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్. మార్చి 31లోపు పన్నులు చెల్లించి కాకినాడ కార్పొరేషన్ కు సహకరించాలి స్వప్నిల్ దినకర్ నగరవాసుల్ని కోరారు. పన్నులు చెల్లించని వారి ఇళ్లలో సామాన్లు తీసుకెళ్లేందుకు నిన్న వాహనాలు ఏర్పాటు చేశారు. కాకినాడలో జప్తు వాహనాల ఏర్పాటుపై విమర్శలతో వాటిని నిలిపివేశారు.