Kakani Govardhan Reddy Satires On Lokesh Padayatra: నారా లోకేష్ తన పాదయాత్రను ఒక సర్కస్ కంపెనీలా నిర్వహిస్తున్నాడని.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి చంద్రబాబుపై ఉన్న కోపాన్ని వైసీపీ నాయకులపై లోకేష్ చూపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. తాతని వెన్నుపోటు పొడిచినట్టే, తనకూ వెన్నుపోటు పొడుస్తాడేమోనని లోకేష్ భావిస్తున్ననాడని అన్నారు. భవిష్యత్తు ఏంటో అర్థం కాక లోకేష్ అయోమయంలో ఉన్నాడన్నారు. లక్ష కోట్ల రాజధాని అని ప్రజలకు చెప్పి, మంగళగిరిలో లోకేష్‌తో చంద్రబాబు పోటీ చేయించాడని.. అక్కడ ఆయన్ను ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. ఇప్పుడేదో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని పాదయాత్ర చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన పాయింట్లను మాత్రమే లోకేష్ చదువుతున్నాడని విమర్శించారు.
Namrata Malla: ఏంటి పాప.. అందాలు చోరికి గురవుతాయని తాళం వేశావా?
లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడే.. అతనితో సంబంధం లేకుండా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని కాకాణి పేర్కొన్నారు. రాత్రి తీసుకున్నది దిగకపోవడంతో.. లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రమంతా తిరిగి, టీడీపీని సమీకృతం చేసి, గెలిపిస్తానని కబుర్లు చెబుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ముఖ్యమంత్రి మనవడిని, ముఖ్యమంత్రి కొడుకుని అని లోకేష్ చెప్పుకుంటున్నాడే తప్పే.. సొంత సత్తా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 2014 -19 మధ్య చంద్రబాబు జనరంజక పాలన అందించి ఉంటే.. ప్రజలు ఆయన్ను ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేశారన్న ఆయన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆరోపణల్ని ఎందుకు రుజువు చేయలేదని నిలదీశారు. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని, అధికారంలోకి వస్తామని భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ముత్తుకూరులో జరిగిన సమావేశానికి.. ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించారని అభిప్రాయపడ్డారు.
Fish Curry : గుమగుమాలాడే చేపల పులుసును ఇలా చేసుకోండి.. మొత్తం ఖాళీ చేస్తారు..
సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పసుపు కుంభకోణం జరిగిందని.. అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి కాకాణి ఆరోపించారు. నీరు, చెట్టు, రైతు రథం పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పోర్ట్ వాళ్ళ నుంచి ఇప్పిస్తానని చెబుతున్నారని.. ఎవరిస్తారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన సాయంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధిని చూడకుండా.. లోకేష్ ఒక్క రోజులోనే పారపోయాడన్నారు. పాదయాత్ర ఒక ఈవెంట్ మాదిరిగా ఉందే తప్ప.. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనడం లేదన్నారు. మత్స్యకారులు ప్రశ్నిస్తారని భయపడి, వారి సమావేశాన్ని రద్దు చేశారన్నారు. చిన్న సందులో సమావేశం పెట్టి.. ప్రజలు భారీగా వచ్చారని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాదయాత్ర లక్ష్యం.. వైసీపీ నేతల్ని తిట్టించడమేనన్నారు. పాదయాత్ర వల్ల కాళ్ల నొప్పులు, భోజనాల ఖర్చు తప్ప ఉపయోగమేమీ లేదన్నారు.