మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత. అందరి సూచనలతో రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంత్రి అయినా..రాష్ట్ర స్థాయి బాధ్యతలు వున్నా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి …నేను కలిసి పని చేశాం. నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదం చేసింది.
వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం. 70 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ కు కృతజ్ఞతలు. జెడ్పీ ఛైర్మన్ గా ఎలా సహకరించారో..అదే విధంగా మంత్రిగా నా వేలు సట్టుకుని నడిపించాలని కోరుతున్నానన్నారు కాకాణి. వై.ఎస్.ఆర్…జగన్ హయాంలో వర్షాలు కురిసే రైతులు సంతోషంగా ఉన్నారు.
Read Also:Anilkumar Yadav: 2024లో మళ్ళీ గెలుస్తాం…అంతా కేబినెట్లోకి వస్తాం
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో ఒకేసారి 5 వేల ట్రాక్టర్లను రైతులకు ఇస్తాం. ఆర్.బి.కె.లను గవర్నర్ ప్రశంసించారు. వాటి పనితీరులో ఉన్న లోపాలను సవరిస్తాం. పవన్ కల్యాణ్, చంద్రబాబులు రైతుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళకు రూ.3 వేల కోట్ల ను స్థిరీకరణ నిధిని జగన్ ఏర్పాటు చేశారు. రైతులు నష్టపోకుండా చూస్తాం అన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా చూస్తాం. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. వ్యవసాయనికి సంబంధించిన శాఖలను సమన్వయం చేసి రైతులకు ప్రయోజనం కలిగేలా చూస్తాం. మంత్రిగా అందరికీ అందుబాటులో వుంటానన్నారు.
మంత్రి కాకాణి సభకు ఎంపీలుఆదాల ప్రభాకర్ రెడ్డి..మాగుంట శ్రీనివాసులు రెడ్డి..మద్దెల గురుమూర్తి..ఎం.ఎల్ ఏ.లు ఆనం రామనారాయణ రెడ్డి..మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..మానుగుంట మహీధర్ రెడ్డి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి..ఎం.ఎల్.సి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి..నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ.సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నేతలు. ప్రజలు..అభిమానులు భారీగా హాజరయ్యారు. మాజీ మంత్రి అనిల్ సభకు హాజరుకాలేదు.
