ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు ఎవరు అనే దానికి తెరపడింది.. అయితే, అక్కడక్కడ అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.. ఒకరు ఏకంగా రాజనీమాకు సిద్ధపడినట్టు తెలుస్తుండగా.. మరోసారి అవకాశం రాలేదనే అసంతృప్తి వ్యక్తంచేసేవారు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా అవకాశం దక్కి.. కాసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందన్నారు.. అయితే, ఆశించిన తర్వాత పదవి దక్కలేదని కొంత మందికి బాధ ఉండొచ్చు అని.. అవసరం అయితే ఒక మెట్టు దిగైనా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించారు.. అందరినీ సమన్వయం చేసుకుంటూ పని చేస్తానన్నారు. ఇక, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశాను.. నిన్ననే రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టు వెల్లడించారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Read Also: TRS Protest: గల్లీలో ముగిసింది.. ఇక ఢిల్లీలో పోరు.. కేసీఆర్ రైతు దీక్ష
