NTV Telugu Site icon

KA Paul: 30 నిముషాల టైం ఇస్తే ఏపీ అప్పు తీర్చేస్తా!

Ka Paul

Ka Paul

ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీ రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు కే పాల్. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్నారు. లక్షల కోట్లు అప్పు చేసిన జగనుకి మళ్లీ పాలన పగ్గాలిస్తే ఇబ్బందే.ఏపీలో 100కి 60 శాతం ప్రజలు నన్నే కోరుకుంటున్నారు.చంద్రబాబు, జగన్ను గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే.చంద్రబాబు ఇక సీఎం అవడు.టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే.ఏపీలో పరిస్థితులు విషమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఇబ్బంది పెట్టారని జగన్ సీఎం అయ్యాక ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ నాకు 30 నిమిషాల సమయమిస్తే కలిసి రాష్ట్రం అప్పు తీర్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. నన్ను గెలిపిస్తే ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తాయి. కుల కుటుంబ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్పలాభం లేదని రాష్ట్ర ప్రజలకు అర్దం అవుతోంది.జగన్ ఎన్నికల ముందు 25 ఎంపీలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.

ఇపుడు జగన్, చంద్రబాబు మోడీకి మసాజులు చేస్తున్నారు.తెలుగు వారి సత్తా చాటల్సిన అవసరం ఉంది.అప్పట్లో ఎన్టీఆర్ ఇందిరా గాంధీని ఎదిరించారన్నారు కేఏ పాల్. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసిన పాల్… తనదే గెలుపని డంకా భజాయించి మరీ చెప్పారు. కానీ వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు పాల్.

Read Also: Minister Roja: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు మావే.. రోజా ధీమా

Show comments