Site icon NTV Telugu

అమరావతి రైతులు కళ్లుతెరవాలి: సుధాకర్‌ బాబు

న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ముసుగు వేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వారు ఇకనైనా కళ్లు తెరవాలని వైసీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. 157 మంది మాత్రమే పాల్గొంటా మని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని, ఇప్పుడేమో చంద్రబాబు సంఘీభావం పేరుతో రాష్ట్రంలో అలజడికి కుట్రలు పన్నుతున్నడని ఆయన అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగింది. రాజధాని రైతులకు ప్యాకేజీ అందిం దని,ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు, ఇతర అలవెన్సులు అందుతున్నాయని సుధాకర్‌బాబు అన్నారు.

అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందన్నారు. మిగిలిన ప్రాం తాలు అభివృద్ధి చెందకూడదు… మా తుళ్లూరులోనే రాజధాని ఉం డాలనే డిమాండ్‌ విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
పాదయాత్రకు టీడీపీ నేతలు బయటి ప్రాంతాల నుంచి జనాలను తోలుకుని వస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఉన్మాద రాజకీయ నాయకుడని సుధాకర్‌బాబు ఆరోపించారు.

Exit mobile version