NTV Telugu Site icon

Jupudi Prabhakar Rao: అమరావతి ఎక్కడికీ పోలేదు.. చంద్రబాబు అప్పులు మేం తీరుస్తున్నాం

Jupudi 1

Jupudi 1

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ నేత జూపూడి ప్రభాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎక్కడికి వెళ్ళలేదు..నారాయణ కాలేజీలతో పాటు అమరావతి అక్కడే వుంటుంది. విశాఖ పరిపాలనతో పాటు ఆర్థిక రాజధానిగా మారుతోందన్నారు. ప్రాంతీయ విభేదాలకు ఆస్కారం లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీఎం రమేష్ మీరు బీజేపీ నా లేక టీడీపీనా ముందు చెప్పండన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు..అమరావతి అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

Read Also: Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు

ఇప్పుడు అమరావతి తో పాటు అన్ని ప్రాంతాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ను కుప్పం ప్రజలే వెళ్లిపొమంటున్నారు. చంద్రబాబు చేసిన రెండు లక్షల కోట్లు అప్పు ఈ ప్రభుత్వం తీరుస్తోంది. దేశంలో వేలాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో చనిపోతే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్ర కార్మికులను ఆదుకున్నారు. కరోనా మహమ్మారి వేళ జగన్ మోహన్ రెడ్డి పారాసెటమాల్ వేయమంటే నవ్వారు..ఇప్పుడు అదే ప్రోటోకాల్ టాబ్లెట్ అయ్యిందన్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ