NTV Telugu Site icon

స‌ర్కార్‌కు స‌మ్మె నోటీసు.. 9 నుంచి స‌మ్మె..

juda

సమ్మెకు సిద్ధం అవుతున్నారు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు… ఈ మేర‌కు ఏపీ స‌ర్కార్‌కు స‌మ్మె నోటీసులు ఇచ్చారు… ఈనెల 9వ తేదీ నుంచి విధులు బహిష్కరించాల‌ని జూనియర్ రెసిడెంట్ వైద్యులు నిర్ణ‌యించారు.. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని కోరుతున్న వైద్యులు.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆస్ప‌త్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కూడా మ‌రో డిమాండ్ ఉంది.. స్టైఫండులో టీడీఎస్ కట్ చేయకూడదని కోరుతున్న వైద్యులు.. ఈ నెల 9వ తేదీన కరోనాకు సంబంధం లేని విధులు బ‌హిష్క‌రిస్తామ‌ని నోటీసులో పేర్కొన్నారు.. ఇక‌, 10వ తేదీన కోవిడ్ సంబంధిత విధులు కూడా బహిష్కరించ‌నున్నారు.. 11వ తేదీన కోవిడ్ సంబంధం లేని అత్యవసర విధుల బ‌హిష్క‌రించ‌నుండ‌గా.. 12వ తేదీన కోవిడ్ సంబంధిత అత్యవసర విధులు కూడా బహిష్క‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. త‌మ న్యాయమైన కోర్కెలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు జూడాలు.