Site icon NTV Telugu

అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్..

ntr

ntr

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అట్టడుగుపోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి తమదైన రీతిలో స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు.

” అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం.. అయితే అలాంటి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ, వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు.. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసును కలిచి వేసింది.. ఎప్పుడైతే ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు.. ఇలాంటి మాటలు ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబంలో ఒకడిగా మాట్లాడడంలేదు.. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను.. రాజకీయ నాయకులందరికీ ఒక్కటే విన్నపం.. దయచేసి ఈ అరాచక సంస్కతిని ఇక్కడితో ఆపేయండి.. ప్రజా సమస్యలపై పోరాడండి.. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి .. ఇది నా విన్నపం మాత్రమీ.. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుకుంటున్నా” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version