Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను శుక్రవారం సాయంత్రం ప్రముఖ నగల విక్రయ సంస్థ జోయ్ అలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్ జాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో అలుక్కాస్ వర్గీస్ సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.
Read Also: తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?
ఈ సందర్భంగా ఏపీలో తాము అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ జోయాలుక్కాస్ అధినేతకు వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీకి జోయాలుక్కాస్ వస్తే స్వాగతిస్తామని, ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు అయినా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ ఛైర్మన్ కంది రవిశంకర్ పాల్గొన్నారు.