NTV Telugu Site icon

Jogi Ramesh: చంద్రబాబు మేనిఫెస్టోని చింపి.. పార్సెల్ పంపుతున్నా

Jogi Ramesh Tdp Manifesto

Jogi Ramesh Tdp Manifesto

Jogi Ramesh Comments On TDP Manifesto In Tirupati: వైసీపీ మంత్రి జోగి రమేశ్ మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన ప్రకటించిన మేనిఫెస్టోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను తాను చింపి, పార్సెల్ పంపుతున్నానని పేర్కొన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చారని, ఆ హామీల్లో పదింటిని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మురికిపట్టి మలినమైన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. శతకోటి వాగ్దానాలు ఇచ్చినా సరే.. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరని అన్నారు. ఓ వైపు ‌సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో.. సీఎం వైఎస్ జగన్ పాలన ఈ నాలుగు సంవత్సరాల్లో దిగ్విజయంగా సాగిందని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో.. ఏ రాష్ట్రంలో, ఏ సీఎం కూడా చేయని అభివృద్ధిని జగన్ చేశారన్నారు. రెండు లక్షల 11 వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేయడంతో పాటు 35 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించి, నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నామని చెప్పారు.

Bengaluru Rains: బెంగళూర్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ..

అంతకుముందు కూడా.. డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో అంటూ టీడీపీ మేనిఫెస్టోని చించి, డస్ట్ బిన్‌లో వేశారు మంత్రి జోగి రమేశ్. గత ఎన్నికల్లో 600కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు. 2014 టీడీపీ మేనిఫెస్టో, 2019 వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలని 98% అమలు చేసిందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంల్లోనూ నాలుగేళ్లలో ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ఒక నకిలీ వ్యక్తి అని.. పార్టీని దొంగతనం చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ పొత్తుల్లో పొర్లాడుతుంటాడంటూ విరుచుకుపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పేదల్ని ధనవంతుల్ని చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.

Merugu Nagarjuna: మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత జగన్‌ది.. చంద్రబాబులా మాయం చేయలేదు