NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 4,765 పోస్టుల భర్తీకి ఆదేశం

Jobs

Jobs

Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తున్న జగన్ సర్కారు తాజాగా మరోసారి ఉత్తర్వులు విడుదల చేసింది. రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 4,765 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

Read Also: Bet Hens: ఉడుతలపల్లి కోడి ధర రూ.70 వేలకు పైనే.. బరిలోకి దిగాయంటే..

కాగా ఆర్బీకేల్లో 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, మరియు 22 పట్టు సహాయక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సంబంధిత శాఖల నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటు విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలు అందించేలా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అందుకే ఆర్బీకేల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీ­టికి త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.